చెన్నై : ఎస్సీలపై పట్టాల్ మక్కల్ కచ్చి అధినేత రాందాస్ చేసిన ఆరోపణలపై తమిళనాడులో అన్నీ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఎస్సీ యువకులు ఇతర కులాలకు చెందిన అమ్మాయిలను వివాహం చేసుకోకుండా నిరోధించాలని ఆయన చేసిన ప్రకటనపై చర్య తీసుకోవాలని పలు రాజకీయపక్షాలు డిమాండ్ వ్యక్తం చేశాయి. విడుదలై చిరుత్తుగళ్ కట్చి నేత తిరుమాళావన్ మాట్లాడుతూ రాందాస్‌పై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాని నమోదు చేయాలని డిమాండ్ చేశారు.




