బర్వాలా, నవంబర్ 23 (జనంసాక్షి) : వివాదాస్పద స్వామిజీ రాంపాల్ ఆశ్రమంలో అక్రమాల పుట్ట ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఆయనపై విచారణ కొనసాగుతోంది. హర్యానా పోలీసులు ఆదివారం వివాదాస్పద స్వామి రాంపాల్‌ను విచారణ నిమిత్తం
ఆయన ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఆశ్రమంలో రాంపాల్, ఆయన శిష్యుల రహస్య
కార్యకాలపాల గురించి పోలీసులు విచారిస్తున్నారు. హిసార్ జిల్లాలోని బర్వాల పట్టణానికి సవిూపంలో 12 ఎకరాల విస్తీర్ణంలో రాంపాల్ ఆశ్రమం ఉంది. బుధవారం రాంపాల్‌ను
అరెస్ట్ చేసి దేశ ద్రోహం సహా పలు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రాంపాల్ అనుచరులకు, పోలీసులకు మధ్య జరిగిన దాడుల్లో ఆరుగురు మరణించారు. రాంపాల్ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు. రాంపాల్ ఆశ్రమంలో గురువారం నుంచి ప్రత్యేక విచారణ బృందం సోదాలు కొనసాగిస్తోంది. ఆశ్రమంలో రహస్య కార్యకలాపాలపైనా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే గర్భ నిర్ధారణ పరీక్షల కిట్లు లభ్యంకాగా, పెద్ద ఎత్తున లాకర్లు, కర్రలను దాచినట్టు గుర్తించారు. ప్రత్యేక బృందానికి సహకరించేందుకుగాను పోలీసులు రాంపాల్‌ను ఆశ్రమానికి తీసుకెళ్లారు.
ఉద్రిక్త, నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు వివాదాస్పద ఆధ్యాత్మిక గురు స్వామి రాంపాల్(63)ను బుధవారం రాత్రి పోలీసులు బల్వారాలోని ఆయన ఆశ్రమంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 200 మందికిపైగా గాయాలపాలైన మంగళవారం నాటి ఘర్షణల అనంతరం.. బుధవారం ఉదయం నుంచీ ఆశ్రమం వద్ద పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆశ్రమం చుట్టూ పోలీసులు, పారా మిలటరీ బలగాలు భారీగా మోహరించాయి. రాంపాల్ లొంగిపోవాలంటూ లౌడ్ స్పీకర్లలో పదేపదే ప్రకటించారు. ఆశ్రమంలో ఉన్నవారిలో దాదాపు 15 వేల మంది వెలుపలికి వచ్చారు. వారిని పోలీసులు క్షణ్ణంగా పరీక్షించారు. స్వామి రాంపాల్ ప్రైవేటు సైన్యం, అనుచరులు బలవంతంగా తమను లోపలే ఉంచారని బయటకు వచ్చినవారు తెలిపారు.
1951లో హర్యానాలోని సోనేపట్‌లో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రాంపాల్ సింగ్ జతిన్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి హర్యానా నీటిపారుదల శాఖలో జూనియర్ ఇంజనీర్‌గా చేరారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయనను 2000 సంవత్సరంలో విధుల్లోం తొలగించారు. తర్వాత ఆయనే సద్గురు రాంపాల్‌జీ మహారాజ్‌గా అవతారం ఎత్తారు. రాంపాల్ ప్రస్తుతం దాదాపు 100కోట్ల ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి అధిపతి అయ్యారు. హర్యానాలోని హిస్సార్ జిల్లాలో ఉన్న బల్వారాలో 12 ఎకరాల విశాల స్థలంలో ప్రధాన ఆశ్రమమనే ఆధునిక భవనంలో ఆయన నివాసం ఉంది. ఆయనకు ప్రైవేటు సైన్యంతోపాటు బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ కార్లు ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆయనకు 25 లక్షల మందికిపైగా అనుచరులు, భక్తులున్నారు. హర్యానాలో వివాదాస్పద బాబా రాంపాల్ ఆశ్రమం విూద పోలీసులు దాడిచేసి, ఆయన్ను అరెస్టు చేసినప్పుడు అక్కడ దొరికిన వస్తువుల జాబితాలో ఏవేం ఉన్నాయో తెలుసా? రివాల్వర్లు, మిరపకాయ బాంబులు.. వాటితో పాటు గర్భనిర్ధారణ కిట్లు! బల్వారాలోని సత్లోక్ ఆశ్రమంలో గల రాంపాల్ వ్యక్తిగత గదిలో కూడా ఇలాంటి ఓ కిట్ బయటపడింది. రాంపాల్ భక్తులను ఉద్దేశించి ప్రసంగించే స్థలానికి కింద సొరంగం లాంటి గది ఒకటుంది. అందులో మూడు .32 బోర్ రివాల్వర్లు, 19 ఎయిర్‌గన్లు, రెండు .12 బోర్
రైఫిళ్లు, రెండు .315 బోర్ రైఫిళ్లు, మిర్చి గ్రెనేడ్లు, వాటి క్యార్ట్రిడ్జిలు కూడా ఆశ్రమంలో ఉన్నాయి. భారీమొత్తంలో ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రి కూడా కనిపించాయి. రెండు పెద్ద వాటర్ ట్యాంకులు కూడా ఆశ్రమ ప్రాంగణంలో కనిపించాయి. ఛత్తీస్‌గఢ్,
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన సుమారు 865 మందిని అరెస్టు చేశామని, వాళ్లలో ఎవరైనా నక్సలైట్లు కూడా ఉన్నారేమో పరిశీలిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇక రాంపాల్ అయితే.. జైల్లో ఎవరితోనూ మాట్లాడటంలేదు. గత రాత్రి మొత్తం ఆయన ఏవిూ తినలేదు, తాగలేదు. పూర్తి నిరాహారదీక్ష పాటిస్తున్నారు. శుక్రవారం ఉదయం రెండుసార్లు టీ తాగారు, గురువారం నాటి మధ్యాహ్నం నాలుగు చపాతీలు పప్పుతో తిన్నారు. ఆ తర్వాత పూర్తి నిరాహారంగానే ఉన్నారు.





