రాజమండ్రి,నవంబర్1(జనంసాక్షి): రాష్ట్ర రాజకీయాల్లో విలువలు నశించి వినోద రాజకీయాలు పెరిగాయని టీడీపీ నేత,ఎంపి అశోక్ గజపతిరాజు ఆరోపించారు. ప్రస్తుతం కోడి కత్తి కథ నడుస్తోందని, ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం కేసులో వినోదాత్మకం ఎక్కువగా నడుస్తోందని విమర్శించారు. చట్టాలపై నమ్మకం లేదంటూ జగన్ ప్రజలకు ఎలాంటి సంకేతాలిస్తున్నారని ప్రశ్నించారు. జగన్ తనని తాను కూడా నమ్మే పరిస్థితుల్లో లేరని, కేంద్రంలో ఫెడరల్ భావాలున్న పార్టీలతో కలిసి వెళ్తామని అశోక్ గజపతిరాజు తెలిపారు.




