రాజధాని నిర్మాణానికి ఎన్‌ఆర్‌ఐ రూ.10లక్షల విరాళం

అమరావతి, మే9(జ‌నం సాక్షి) : నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం నూజెర్సీకి చెందిన ఎన్‌ఆర్‌ఐ చావా పద్మ రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమెరికాలో నివాసం ఉంటున్నా పుట్టినగడ్డపై వున్న మమకారంతో విరాళం ఇచ్చానని అన్నారు. ఏపీపై కేంద్రం చూపుతున్న వివక్షను ప్రవాసాంధ్రులం గమనిస్తున్నామని ఎన్‌ఆర్‌ఐ చావా పద్మ అన్నారు. /ూజధాని నిర్మాణం కోసం సాయం చేయాలని సీఎం ఇచ్చిన పిలుపు, ఆయన నిరంతర శ్రమ మమ్మల్ని కదిలించిందని పేర్కొన్నారు. చంద్రబాబు ముందుచూపుతో వేలమంది తెలుగువారు దేశవిదేశాల్లో ఉన్నత స్థితిలో వున్నారని కొనియాడారు. రాజధాని నిర్మాణం కోసం మరింత మంది ఎన్‌ఆర్‌ఐలు రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు సిద్ధంగా వున్నారని చావా పద్మ పేర్కొన్నారు. రూ.10లక్షల విరాళం అందజేసిన చావా పద్మను సీఎం చంద్రబాబు అభినందించారు. ప్రపంచ దేశాలు ఆకర్షించేలా అమరావతి రాజధాని నిర్మాణం చేస్తామని అన్నారు. 

తాజావార్తలు