రాజమండ్రి రైల్వే ఆర్చ్ వంతెనపై విరిగిన ఇనుపస్తంభం
రాజమండ్రి, ఆగస్టు 5 : రాజమండ్రిలోని గోదావరి నదిపై ఉన్న రైల్వే ఆర్చ్ వంతెనపై ఏడో ఇనుప స్తంభం విరిగింది. దీంతో ఈ వంతెనపై రైళ్ల వేగాన్ని 20 కిలోమీటర్లకు కుదించారు. ఇనుపస్తంభం విరిగిన నేపథ్యంలో వంతెనను నిపుణుల బృందం ఈ రోజు పరిశీలించనుంది.