Friday, 6 November 2026

రాజ్యాంగ వ్యవస్థలను.. బాబు నిర్వీర్యం చేస్తున్నాడు

 

– ఎవరూ ప్రశ్నించరాదనే స్థాయికి బాబు వెళ్లాడు

– వైసీపీ నేత ఆనం రాంనారాయణ

హైదరాబాద్‌, నవంబర్‌17(జ‌నంసాక్షి) : సీఎం చంద్రబాబు నాయుడు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని వైసీపీ నేత ఆనం రాంనారాయణ రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ఎవరు ప్రశ్నించరాదనే స్థాయికి చంద్రబాబు వచ్చారని, దేశ ఔన్నత్యాన్నే ప్రశ్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవినీతి, అక్రమాలు, హత్యాయత్నం కుట్రలపై స్వయం ప్రతిపత్తి కలిగిన సీబీఐ దర్యాప్తు జరపడానికి వీల్లేదని అన్నారు. భారత దేశంలో ఏపీ అంతర్భాగం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎందుకింత భయమని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఐటీ దాడులు చేస్తే ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని, ఆయన పాలన రాజ్యాంగ బద్ధంగా సాగుతోందా అని నిలదీశారు. చంద్రబాబు బినావిూ సంస్థలపై దాడులు

జరిగితే ఆయనకెందుకు భయమని, ఏపీలో జరుగుతున్న అవినీతి, అన్యాయన్ని.. పార్టీలన్ని ప్రశ్నించాలని కోరారు. ప్రతిపక్షనేత హత్యాయత్నం కేసును సీబీఐకి ఎందుకు అప్పగించడం లేదని, వైఎస్‌ జగన్‌ను ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు లేదా అని రాంనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు చేష్టలు, తీరును ప్రజలు గమనిస్తున్నారని తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.