కరీంగనర్,ఫిబ్రవరి26(జనంసాక్షి): చినజీయరు స్వామి ఆధ్వర్యంలోని జీయర్ ట్రస్టు రాయికల్ పట్టణంలో భారీ కళ్యాణమండపాన్ని నిర్మిస్తోంది. సుమారు కోటితో నిర్మించనున్న కల్యాణ మండపం నిర్మించనున్నట్లు జీయర్ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. దీనికోసం మార్చి 2నభూమిపూజ చేపట్‌ఆరు. అలాగే వృత్తి విద్యా కళాశాల, రూ.4 లక్షలతో ఏర్పాటు చేసిన కొముర భీం విగ్రహావిష్కరణ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిఎం కెసిఆర్ ప్రత్యేక ఆహ్వనితులుగా హాజరవుతారని తెలుస్తోంది. కేంద్ర మంత్రి జోలోరాం, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావులు కూడా ఇందులో పాల్గొనేందుకు వస్తారు. వీరంతా హాజరవుతారని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఇదే పర్యటనలో మండలంలో రూ.70 కోట్లతో మంజూరు చేసిన బోర్నపల్లి వంతెన, బీడీ కార్మికులకు ‘ఆసరా’ పింఛను పంపిణీ కార్యక్రమాలు ఉండే అవకాశం ఉంది. అధికారికంగా ఆయన పర్యటన వివరాలు రాలేదని సమాచారం. ప్రముఖుల రాక కోసం రాయికల్‌లో హెలీప్యాడ్ ఏర్పాట్లను జగిత్యాల సబ్ కలెక్టర్ కృష్ణభాస్కర్ పరిశీలించారు. ఈ పర్యటనకు సంబంధించి వివరాలు ఖరారు కావాల్సి ఉంది. అయిన వెంటనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.




