Wednesday, 4 November 2026

5లోగా టిడిపి కమిటీల ఏర్పాటు పూర్తి

వరంగల్‌,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి): తెలుగుదేశం పార్టీ గ్రామ, వార్డు కమిటీల ఎన్నికలను మార్చి 5వతేదీ లోపు పూర్తి చేయాలని జిల్లా కన్వీనర్‌ ఎడబోయిన బస్వారెడ్డి ఒక ప్రకటనలో టిడిపి శ్రేణులకు సూచించారు.ఈనెల 28తేదీలోపు పూర్తిచేయాల్సిఉండగా మార్చి 5వతేదీ వరకు గడువును పొడిగించినట్లు పేర్కొన్నారు.ఇప్పటికే సభ్యత్వ నమోదు పూర్తయ్యిందన్నారు. పక్కాగా కార్యవర్గాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు.  ఈనెల 6నుంచి ప్రారంభం కావాల్సిన ఎన్నికలను టిడిపి అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో 15నుంచి ప్రారంబించడం జరిగిందని తెలిపారు.  ఎన్నికలు సమర్థంగా నిర్వహించిన నాయకులకు మండల, జిల్లా కమిటీల్లో స్థానాలు కల్పించడం జరగుతుందని బస్వారెడ్డి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *