రావులపాలెంలో హెలికాఫ్టర్ అత్యవసర ల్యాండింగ్
గుంటూరు, మే3(జనం సాక్షి): బలమైన ఈదురుగాలుల కారణంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం కేఎస్‌ఆర్ కాంప్లెక్స్ సవిూపంలోని లేఅవుట్‌లో గురువారం ఓ హెలికాఫ్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. కాకినాడ సముద్రతీర ప్రాంతంలోని ఓఎన్‌జీసీ సంస్థ నుంచి రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన హెలికాఫ్టర్‌ను ఈదురుగాలుల కారణంగా పైలట్ అత్యంత చాకచక్యంగా ల్యాండ్ చేశాడు. అందులో ఇద్దరు పైలట్లతో పాటు సంస్థకు చెందిన ఆరుగురు అధికారులు ఉన్నారు. హెలికాఫ్టర్ ల్యాండ్ అయిన విషయం తెలుసుకున్న స్థానికులు దాన్ని చూసేందుకు ఎగబడ్డారు.