Monday, 2 November 2026

రావెల కుమారుడు సుశీల్‌పై నిర్భయ కేసు

2హైదరాబాద్ : ఏపీ మంత్రి రావెల కుమారుడు సుశీల్‌ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే సుశీల్‌కు పోలీసులు 41 సీఆర్‌పీసీ క్రింద నోటీసులు జారీ చేశారు. నిన్న బంజారాహిల్స్‌ రోడ్డు నెం.13లో మహిళను వేధించిన కేసులో.. సుశీల్‌తో పాటు డ్రైవర్‌ అప్పారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అజ్ఞాతంలో ఉన్న సుశీల్‌ కోసం రెండు బృందాలు రంగంలోకి దిగాయి.

రెండు బృందాలతో గాలింపు..

బంజారాహిల్స్‌ ఘటనలో బాధితురాలి ఫిర్యాదు మేరకు సెక్షన్‌ 354 కింద కేసు నమోదు చేశామని బంజారాహిల్స్‌ ఏసీపీ తెలిపారు. అయితే నిందితులు పరారీలో ఉన్నారని.. వారి కోసం రెండు బృందాలు గాలిస్తున్నాయన్నారు.

బాధితురాలు ఫాతిమాను తీసుకొని బంజారాహిల్స్‌ పీఎస్‌కు వెళ్లిన కార్పొరేటర్‌ విజయ

రావెల కుమారుడు సుశీల్‌ను అరెస్ట్ చేయాల్సిందేనంటూ కార్పొరేటర్ గద్వాల విజయ బాధితురాలు ఫాతిమాతో కలిసి బంజారాహిల్స్‌ పీఎస్‌కు వెళ్లారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. అయితే ఎఫ్ఐఆర్ లో కారు డ్రైవర్‌ పేరు మాత్రమే నమోదు చేశారని, రావెల కొడుకు పేరు పెట్టలేదని కార్పొరేటర్ విజయ అంటున్నారు. నిందితుడిని అరెస్ట్ చేయకుంటే మంత్రి ఇంటిని ముట్టడిస్తామన్నారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సుశీల్‌ను శిక్షించాల్సిందేనని, తనకు జరిగిన అవమానం ఇంకెవ్వరికి జరగొద్దని బాధితురాలు ఫాతిమా డిమాండ్‌ చేశారు.

రావెలకుమారుడివ్యవహారంవేరేరాష్ట్రంలోజరిగింది–ఏపీమంత్రిచినరాజప్ప

ఇక రావెల కుమారుడు సుశీల్‌ వ్యవహారంపై ఏపీ హోంమంత్రి చినరాజప్ప స్పందించారు. ఇది వేరే రాష్ట్రంలో జరిగిన అంశం.. ఏం జరిగిందో నాకు తెలియదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తప్పు జరిగినట్లు తేలితే శిక్షిస్తారు లేకపోతే.. విచారించి వదిలేస్తారన్నారు చినరాజప్ప.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *