రాష్టాన్న్రి నాశనం చేయడానికే చేతుల కలుపుతున్నారు: దేవినేని
విజయవాడ,జనం సాక్షి ): రాష్టాన్న్రి సర్వనాశనం చేయడానికే ప్రతిపక్షనేత జగన్ బీజేపీతో చేతులు కలిపారని దీన్ని ప్రజలు గమనిస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఇందుకోసం ఆ పార్టీ నేతలు తెగ ఆరాటపడుతున్నారని అన్నారు. విజయవాడ రూరల్ మండలం రాయనపాడు గ్రామంలో మంత్రి ఉమా సైకిల్‌యాత్ర నిర్వహించారు. తొలుత హరిజనవాడలో ఉన్న జగ్జీవన్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి ఉమా మాట్లాడుతూ…కేసుల్లో ఉన్న వైఎస్ జగన్‌ను చేరదీస్తే చెప్పినట్లు వింటాడని, రాష్ట్రం తమ గుప్పెట్లో ఉంటుందనే ఉద్దేశ్యంతో బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. బలమైన నాయకుడు చంద్రబాబు ఏపీలో ఉంటే రాష్ట్రం గుజరాత్‌ను మించిపోతుందనే ద్వేషంతో మోదీ జగన్‌ను చేరదీస్తున్నారన్నారు. రాయనపాడులో ఎప్పుడూ లేని అభివృద్ధి జరిగిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ గ్రామ అధ్యక్షుడు శీలంనేని సాంబశివరావు, ఉపసర్పంచ్ కాటంనేని శివప్రసాద్, మండల పార్టీ కార్యదర్శి నరేంద్ర, మాజీ సర్పంచ్ సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు. పోరంకి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కార్యాలయం నుంచి టీడీపీ నేతలు బందరు రోడ్డుపె ఉయ్యూరు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.