Tuesday, 3 November 2026

రాష్టాన్రికి నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి

సింగిల్‌ ఇంజన్‌ సర్కార్‌తోనే అంతా అభివృద్ది
మోడీ సభతో ఒరిగిందేవిూ లేదన్న మంత్రి తలసాని
హైదరాబాద్‌,జూలై4(జనం సాక్షి):  కేంద్రం రాష్టాన్రికి ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని టెంపుల్స్‌ గురించి మోడీ మాట్లాడారని… అసలు దేవాలయాల అభివృద్ధికి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలన్నారు. ధాన్యం కొనుగోలు గురించి ఇప్పటికి ఇంకా సందిగ్ధం కొనసాగుతోందన్నారు. సింగిల్‌ ఇంజన్‌ సర్కార్‌ తోనే అన్నీ అభివృద్ధి చేస్తున్నా మని.. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఉన్న రాష్టాల్ల్రో ఏం అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి బీజేపీ పాలిత రాష్టాల్ల్రో జరుగుతుందా అని నిలదీశారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై జరిగిన వేడుకల్లో మంత్రి తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా విూడియాతో మాట్లాడారు. బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం చప్పగా సాగింద న్నారు. మోదీ హైదరాబాద్‌ అందాలు చూసి వెళ్లారని చెప్పారు. బీజేపీ సభకు బల్కంపేట టెంపుల్‌కి వచ్చినంత మంది రాలేదని తలసాని అన్నారు. సీఎం కేసీఆర్‌ అడిగిన ప్రశ్నలకి మోడీ ఒక్క సమాధానం ఇవ్వలేదన్నారు. టెక్ట్స్‌ టైల్‌ పార్క్‌, కోచ్‌ ఫ్యాక్టరీ ఇచ్చారా అని అడిగారు. అమిత్‌ షా కూడా ఇష్టానుసారంగా మాట్లాడారని.. సికింద్రాబాద్‌ అభివృద్ధికి కిషన్‌ రెడ్డి చేసిందేమిటో చెప్పాలన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం పోతేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ సక్రమంగా అమలుకాకపోతే బీజేపీ వాళ్లు రాష్ట్రంలో తిరిగేవాళ్లా అన్న తలసాని..బీజేపీ లాగ చిల్లర రాజకీయాలు చేయమని చెప్పారు. దేశం నుంచి బీజేపీని తరమికొట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. రాష్టాన్రికి కేంద్రం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పలేక పోయారని మంత్రి తలసాని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో ఎక్కడా జరగడం లేదని చెప్పారు. బీజేపీ నేతలు అనవసరంగా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఆదివారం నాటి సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నీళ్లు, నిధుల గురించి మాట్లాడారని, రెండ్రోజులపాటు జరిగిన కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ నేతలు తాగిన నీళ్లు తెలంగాణవి కాదా అని ప్రశ్నించారు.