Thursday, 5 November 2026

రాష్ట్రంలోని జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జి మంత్రులు

హైదరాబాద్‌: జిల్లాలకు కొత్త ఇన్‌చార్జి మంత్రులను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. శ్రీకాకుళం జిల్లాకు ఏరాసు ప్రతాపరెడ్డి, విజయనగరం జిల్లాకు విశ్వరూప్‌, విశాఖకు ధర్మాన ప్రసాదరావు, తూర్పుగోదావరి జిల్లాకు సబితా ఇంద్రారెడ్డి నియమితులయ్యారు. కర్నూటు జిల్లాకు కొండ్రు మురళీమోహన్‌, అనంతపురం జిల్లాకు గంటా శ్రీనివాసరావు, మహబూబ్‌నగర్‌కి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మెదక్‌ జిల్లాకు డీకే అరుణ, నిజామాబాద్‌కు ముఖేశ్‌గౌడ్‌, కరీంనగర్‌కు పొన్నాల లక్ష్మయ్య, వరంగల్‌కు రావిరెడ్డి వెంకటరెడ్డి, ఖమ్మం జిల్లాకు పసుపులేటి బాలరాజు, నల్గొండ జిల్లా సునితా లక్ష్మారెడ్డి, రంగారెడ్డికి డి. శ్రీధర్‌బాబు, ఆదిలాబాద్‌ జిల్లాకు బస్వరాజు సారయ్య, హైదరాబాద్‌కు గీతీరెడ్డి ఇన్‌ఛార్జీ మంత్రులుగా నియమితులయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాకు కన్నా లక్ష్మినారాయణ, కృష్ణాకు తోట నరసింహం, గుంటూరుకు టీజీ వెంకటేశ్‌, ప్రకాశం జిల్లాకు శైలజానాధ్‌ నెల్లూరుకు పితాని సత్యనారాయణ, చిత్తూరు జిల్లాకు పార్థసారధి, కడపకు మహీధర్‌ రెడ్డిలను నియమించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *