సులభతర వాణిజ్యంతో ఉపాధికి పెద్దపీట
బయ్యారం గనులు సింగరేణికి అప్పగించే యోచన: కెటిఆర్
హైదరాబాద్,జూన్4(జనం సాక్షి ): సులభతర వాణిజ్య విధానం ద్వారా ఉపాధి కల్పన, ఖజానాకు ఆదాయం పెంపు లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికలు అమలు చేయడం వల్ల దేశ వృద్ధిరేటు కంటే తెలంగాణ వృద్ధిరేటు మెరుగ్గా ఉందని తెలిపారు. హైదరాబాద్‌లోని ‘ది పార్క్ ¬టల్’లో 2017-18 పారిశ్రామిక, వాణిజ్య వార్షిక నివేదికను మంత్రి విడుదల చేసిన సందర్భహంగా పలు అంశాలను వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్లలోనే పారిశ్రామిక రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. రాష్ట్రంలోని 19 ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తోందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండస్టియ్రల్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్‌బీ బేగ్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి కేటీఆర్.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటీ డేటా పోర్టల్ ను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అన్ని రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా నిలుస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. అన్ని రంగాల్లో పురోగమిస్తున్న తెలంగాణ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. టీఎస్ ఐపాస్ పథకం పారిశ్రామిక అభివృద్ధిలో నూతన ఒరవడిని సృష్టించిందని చెప్పారు. 2017-18 వార్షిక సంవత్సరంలో రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి 10.4 శాతం పెరిగిందన్నారు. టీఎస్‌ఐపాస్ వల్ల ఇప్పటివరకు లక్షా 23 వేల 478 కోట్ల పెట్టుబడులు రాగా.. 5 లక్షల 27 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించామన్నారు. ఫార్మాసిటీకి త్వరలోనే అన్ని అనుమతులు వస్తాయన్నారు మంత్రి కేటీఆర్. ఫార్మా సిటీ భూ నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని హావిూ ఇచ్చారు. మరోవైపు కాగజ్ నగర్ పేపర్ మిల్లును ఏడాదిన్నరలోగా తిరిగి పునరుద్ధరిస్తామన్నారు. గత ప్రభుత్వాల 10 ఏండ్ల పాలనలో ఇసుక అమ్మకాలతో 39 కోట్ల ఆదాయం వస్తే తెలంగాణ ప్రభుత్వం వచ్చినంకా 1600 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. వార్షిక నివేదిక విడుదల సందర్భంగా ప్రభుత్వం పలు కంపెనీలతో ఎంవోయూ కుదుర్చుకున్నది. అటు పలువురు పారిశ్రామికవేత్తలకు, ఉత్తమ కంపెనీలకు మంత్రి కేటీఆర్.. అవార్డులు అందజేశారు. ఇకపోతే బయ్యారం గనులను సింగరేణికి అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్న మంత్రి…. సిర్పూర్ కాగిత పరిశ్రమను అతి త్వరలో పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పరిశ్రమలకు రూ.1400 కోట్ల రాయితీ బకాయిలు త్వరలో చెల్లిస్తామని హావిూ ఇచ్చారు. సమావేశంలో పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థల ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో కాలుష్య కారక పరిశ్రమలను నగరం శివారులోకి తరలిస్తామని పునరుద్ఘాటించారు. మౌలిక సదుపాయాలు కల్పించి… మూడేళ్లలో తరలింపు పక్రియ పూర్తి చేస్తామని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానంతో పరిశ్రమలు అభివృద్ధి పథంలోదూసుకుపోతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో పరిశ్రమలకు పురస్కారాలను ప్రదానం చేశారు.




