Monday, 2 November 2026

రాష్ట్రంలో చల్లబడ్డ వాతావరణం

రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షం కురుస్తోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ లో ఆకాశం మేఘావృతమై ఉంది. అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో అయితే గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా జల్లులు కురుస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *