రాష్ట్రంలో 592కు చేరిన కరోనా బాధితులు
కరోనా బాధితులు ఒక్క రోజే 61 మోదు
హైదరాబాద్,ఏప్రిల్ 13(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 592కు చేరింది. సోమవారం ఒక్కరోజే 61 కరోనా పాజి టివ్ కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా బారి న పడి 17 మంది ప్రాణా లు కోల్పోయారు. కరోనా ని యంత్రణకు రాష్ట్ర ప్రభు త్వం పకడ్బందీ చర్యలు తీసు కుంటున్న విషయం విదితమే. లాక్ డౌనన్ను ఏప్రిల్ 30వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగిం చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ కే సులు నమో దవు తుండ టంతో నగ రంపై ప్రత్యేదృష్టి కేంద్రీకరించాలని అధికా రులను ముఖ్యమంత్రి ఆదే శించారు. హైదరాబాద్ ను 17 జోన్లుగా విభజించి ఒక్కో జోన్ను యూనిట్‌గా పంపిణీ పరిగణించి ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు. పాజిటివ్ కేసులు నమోదైన కంటైన్మెంట్ జోన్లను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.