రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో ప్రతిభ కనబరిచిన పంచలింగాల విద్యార్థి

మక్తల్ నవంబర్ 15 (జనంసాక్షి) మక్తల్ మండలం పంచలింగాల గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని వి. పావని ఈనెల 14వ తేదీన హైదరాబాదులోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం, ఈసూఫ్ గూడ హైదరాబాద్ లో జరిగిన 8వ తెలంగాణ రాష్ట్ర కరాటే ఛాంపియన్ షిప్ -2022 పోటీలలో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్ర కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో
మూడవ స్థానంలో నిలిచి కాంస్య పథకం, మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, పాఠశాల విద్యా కమిటీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. భీమ్ రెడ్డి, ఉపాధ్యాయులు కుమార్ ప్రహ్లాద్, జైపాల్ రాజు, మరియు గ్రామస్తులు విద్యార్థిని అభినందించారు.