– అలాంటి పార్టీ అధ్యక్షుడితో చంద్రబాబు భేటీలా?
– రాహుల్‌ను కలవడం దేనికి సంకేతం
– వెన్నుపోటు, కుట్ర రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు
– వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ గల్లంతు ఖాయం
– విలేకరుల సమావేశంలో వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
విజయవాడ , నవంబర్1(జనంసాక్షి) : రాజకీయ ఎత్తుగడ కోసమే ఆంధప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రెండుగా చీల్చిందని, విభజనతో రాష్ట్రానికి తీవ్రద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్ అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. అలాంటి పార్టీతో చంద్రబాబు భేటీ కావడం సిగ్గుచేటని అన్నారు. ఇటలీ దెయ్యం సోనియాను తరిమికొట్టాలని, రాహుల్ గాంధీని పప్పుఅని చంద్రబాబు అనలేదా అని అంబటి నిలదీశారు. అదే చంద్రబాబు నేడు రాహుల్‌ను కలవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కుట్ర, వెన్నుపోటు రాజకీయాలు చంద్రబాబు నైజం అంటూ ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబుకు నీతినిజాయీతీ, ఓ సిద్ధాంతం అనేది ఏవిూ లేదని తన స్వార్థ రాజకీయాల కోసం ఏమైనా చేసే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఎన్టీఆర్‌ను దేవుడని పొగడి.. వెన్నుపోటు పొడిచి మరీ ఆయన కూర్చీని చంద్రబాబు లాక్కున్నారని, గతంలో ఓసారి మోదీని విమర్శించి మళ్లీ ఆయనతోనే చంద్రబాబు జోడి కట్టారని గుర్తుచేశారు. ప్రత్యేక ¬దా అవసరం లేదన్న చంద్రబాబు, ఆ తర్వాత యూ టర్న్ తీసుకుని మళ్లీ ¬దా కావాలన్నారని, చంద్రబాబుది నాలుకా? తాటిమట్టా? అని మండిపడ్డారు. చంద్రబాబును నమ్మి బాగుపడ్డవారెవరూ లేరని అంబటి ఎద్దేవా చేశారు. ఆర్థిక సంబంధాలే తప్ప మానవ సంబంధాలు లేని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడైనా ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేశారా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కదని సర్వేలు చెబుతున్నాయని, ఎన్నికల తరువాత చంద్రబాబు అడ్రస్సు గల్లంతు ఖావడం ఖాయమని అంబటి పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని చీల్చింది కాంగ్రెస్ పార్టీ




