రాష్ట్ర హోం శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి – బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొంగోని సురేష్ గౌడ్ మద్దూరు
(జనంసాక్షి) జూన్ 11: తెలగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని బీజేవైఎం మద్దూర్ మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలో ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఈ సందర్భంగా బొంగోని సురేష్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలపై, అమ్మాయిలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు రాష్ట్రాన్ని ఆందోళనలు కలిగిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిందితుల కేసులు, శిక్షల పట్ల వ్యవహరిస్తున్న తీరువలన రాష్ట్రంలో మహిళలు, యువతులకు రాష్ట్రంలో రక్షణ కరువైంది అని మండిపడ్డారు. మొన్న జూబ్లీహిల్స్, నిన్న నిజామాబాద్, చిలకల గూడ, నేడు ఎల్బీనగర్ లో మైనర్ బాలికలు, యువతులపై జరిగిన అత్యాచార ఘటనలకు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఖండిస్తూ హోం శాఖ అసమర్థ వల్ల బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడం కాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షులు యామ శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి సోగాల మనోజ్ కుమార్, చేర్యాల బిజెపి మండల ప్రధాన కార్యదర్శి సంజీవ్, బిజెపి ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, కార్యదర్శులు పైస బాలకృష్ణ, చింతల రాజు, దూల్మిట్ట ప్రధాన కార్యదర్శి ఆరే శేకర్,చింతల చందు, సందీప్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.