రిటైర్మెంట్‌ అయ్యే ఆలోచన లేదు:సచిన్‌

న్యూఢిల్లీ :క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకునే ఆలోచన ప్రస్తుతానికి లేదని మాస్టర్‌బ్లాస్టర్‌ సచిన్‌ అన్నారు.ఆటను ఎంజాయ్‌ చేస్తున్నంతకాలం క్రికెట్‌ నుంచి తప్పుకునే ఆలోచనే లేదని ఓ ప్రైవేటు ఛానల్‌కు ఇంటర్య్వూలో తెలిపారు.2006 నుంచి తన రిటైర్మెంట్‌ పై మీడియాలో కథనాలు వస్తున్నాయని క్రికెట్‌ను ఎంజాయ్‌ చేస్తున్నంతకాలం ఆటలో కొనసాగుతానని చెప్పారు.కుటుంసభ్యులతో గడపడానికి కొంత సమయం కావాలని బీసీసీఐని కోరడంతో తనను లంక టూర్‌కు దూరంగా పెట్టినట్ట వెల్లడించారు.