Tuesday, 3 November 2026

రిపబ్లిక్ డే ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

3రిపబ్లిక్‌ డే ఏర్పాట్లపై కో ఆర్డినేషన్‌ కమిటీతో రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ సమీక్ష జరిపారు. హైదరాబాద్ లోని సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి అన్ని శాఖల హెచ్‌వోడీలు హాజరయ్యారు. సికింద్రాబాద్ లోని పరేడ్‌ గ్రౌండ్‌ లో రిపబ్లిక్‌ డే ఏర్పాట్లను పకడ్భందీగా చేయాలని అధికారులకు సీఎస్‌ ఆదేశించారు.

ఈ నెల 26న ఉదయం రిపబ్లిక్‌ డే వేడుకలు ప్రారంభమవుతాయని, గవర్నర్‌ నరసింహన్‌ ముఖ్య అతిథిగా పాల్గొంటారని రాజీవ్‌ శర్మ చెప్పారు. అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్‌ నియంత్రణ ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. రాజ్‌ భవన్‌, సచివాలయం‌, అసెంబ్లీ, హైకోర్టు, చార్మినార్‌, గన్‌ పార్క్‌, క్లాక్‌ టవర్‌, ఫతేమైదాన్‌ లను విద్యుత్ దీపాలతో అలంకరించాలని చెప్పారు. నిరంతర విద్యుత్‌, మంచినీటి సరఫరాకు ఏర్పాట్లు చేయాలన్నారు. పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం, కామెంటరీ, ప్రత్యక్ష ప్రసారాలకు ఏర్పాట్లు చేయాలని రాజీవ్‌ శర్మ అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో జీఏడీ ముఖ్య కార్యదర్శి అదర్ సిన్హా, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దనరెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, ఐ అండ్ పీఆర్ కమిషనర్ నవీన్ మిట్టల్, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కిషన్, పోలీస్ అధికారులు తేజ్ దీప్ కౌర్, శివధర్ రెడ్డి, అంజనీకుమార్, మహేష్ భగత్, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, అగ్నిమాపక, స్కౌట్స్ అండ్ గైడ్స్ తదితర శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *