
– మంత్రి హరీశ్ ఢిల్లీలో బిజీ బిజీ
– కేంద్ర మంత్రులతో వరుస భేటీ
న్యూఢిల్లీ,జనవరి13(జనంసాక్షి):హస్తిన పర్యటనలో ఉన్న రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కేంద్ర మంత్రులు ఉమాభారతి, రాంవిలాస్ పాశ్వాన్‌తో సమావేశమయ్యారు. ఉమాభారతితో సమావేశం సందర్భంగా.. దేవాదుల ప్రాజెక్టుకు కేంద్రం ఇవ్వాల్సిన రూ. 297 కోట్లను మంత్రి అడిగారు. మిషన్ కాకతీయ పనులకు నిధులు విడుదల చేయాలని కోరారు. అలాగే మిషన్ కాకతీయ పనుఉల పరిశీలించేందుకు రావాల్సిందిగా కోరారు. రాష్ట్రంలో 900 చెరువు పనులకు రూ. 431 కోట్లతో ఇప్పటికే ప్రతిపాదనలు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. రాంవిలాస్ పాశ్వాన్‌ను కలిసి మొక్కజొన్న బకాయిలు విడుదల చేయాల్సిందిగా మంత్రి కోరారు. కేంద్రం తరపున తెలంగాణలో మొక్కజొన్నను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. మొక్కజొన్న సేకరణకు అయిన ఖర్చు రూ. 212.54 కోట్లుగా తెలిపారు. ఇదిలావుంటే రైతుల అవసరాలకోసం అత్యాధునిక గోదాములు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ కు ఆయన లేఖ రాశారు. 2016 వ్యవసాయ సీజన్ పూర్తయ్యే సమయానికి రెండు దశల్లో 17 లక్షల మెట్రిక్ టన్నులను నిల్వచేసే సామర్థ్యం గల గోడౌన్లను నిర్మించాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు ఈ లేఖలో చెప్పారు. మొత్తం అంచనా వ్యయం రూ.1024 కోట్లు కాగా, నాబార్డు రూ.972.79కోట్ల రుణాన్ని అందిస్తుందని చెప్పారు. అయితే గతంలో వ్యవసాయశాఖ ద్వారా గ్రావిూణ భందరాన్ యోజన పథకం కింద ఇలాంటి నిర్మాణాలకు కేంద్రం సబ్సిడీ ఇచ్చేదని, దానిని కేంద్రం తాత్కలికంగా నిలిపివేసినట్లు తెలిసిందని, అయితే, తాము రైతు సంక్షేమం కోసం ఇప్పటికే ప్రారంభించిన ఈ పని విజయవంతంగా పూర్తయ్యేలా కేంద్రం చూడాలని అన్నారు. రూ. వెయ్యి కోట్లు సహాయం చేసి తాము తలపెట్టిన ఈ బృహత్ కార్యాన్ని పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. ఈ మేరకు హరీస్ రావు మంత్రిని కలసి వివరించారు. తెలంగాణకు కరువు సాయం తక్షణం విడుదల చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కోరారు. రైతులను ఆదుకునేందుకు అండగా నిఅలవాలన్నారు. దీనిపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు చర్చించారు. చర్చ ముగిసిన అనంతరం హరీష్‌రావు విూడియాతో మాట్లాడుతూ.. కరువు పరిస్థితుల తీవ్రత దృష్ట్యా రూ. 1500 కోట్ల సాయాన్ని కోరామని తెలిపారు. జాతీయ డెయిరీ పథకం కింద ఇవ్వాల్సిన రూ. 1,024 కోట్లను అడిగామన్నారు. కరువు సాయంపై రేపు నిర్ణయం తీసుకుంటామని మంత్రి హావిూచ్చారని హరీష్ పేర్కొన్నారు. హరీష్‌రావుతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్ ఉన్నారు. రాష్ట్రంలో చేపట్టిన గోదాంల నిర్మాణం తదితర విషయాలను కేంద్రమంత్రితో చర్చించారు.




