Sunday, 8 November 2026

రియల్‌ వ్యాపారి హత్యపై దర్యాప్తు

నిందితుల కోసం పోలీసుల గాలింపు

హైదరాబాద్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): నగర శివారు ప్రాంతమైన మేడిపల్లిలో అర్ధరాత్రి వేళ ఆర్తనాదాలు స్థానికులను కలవరపరిచాయి. ఏమైందోనని అక్కడి వెళ్లి చూసిన వారికి రక్తపు మడుగులో నిర్జీవంగా పడివున్న మృతదేహం కనిపించడంతో హడలిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిగా ఘటనాస్థలికి తరలివచ్చారు. రక్తపుమడుగులో పడి ఉన్న వ్యక్తిని పరిశీలించారు. కాస్త దూరంలో ఉన్న కారు, దాని నంబర్‌, మృతుడి దగ్గర లభించిన ఆధారాలతో అతడిని నగరంలోని చంపాపేట్‌కు చెందిన కాసాని రాజిరెడ్డిగా గుర్తించారు. మృతిడి బంధువులకు సమాచారం అందించారు. రాజిరెడ్డి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, అతడికి భార్యా, ఇద్దరు పిల్లులు ఉన్నారు.

అయితే రాత్రి ఉప్పల్‌ విూదుగా రాజిరెడ్డి మేడిపల్లి రోడ్డులో వెళుతుండగా దారుణ హత్యకు గురయ్యాడు. రాజిరెడ్డి వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. అతడిని వెంటాడి హత మార్చారని పోలీసులు భావిస్తున్నారు. కారులో వెళుతున్న రాజిరెడ్డిని ఎవరు ఎందుకు చంపారు అనేది మిస్టరీగా మారింది. రాజిరెడ్డి కారును వెంబడించిన గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డను అటకాయించి వేటకొడవళ్లతో నరికి చంపారని మృతుడి బంధువులు భావిస్తున్నారు.