ప్రాజెక్టులపై విపక్షాలకు అవగాహన లేదు
మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్,సెప్టెంబర్3(జనంసాక్షి):
తోటపల్లిప్రాజెక్టుపై విపక్షాలు అనవసరరాద్దాంతం చేస్తున్నాయని భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. ఈ ప్రాజెక్టును రద్దు చేయమని ఆనాడే ప్రతిపక్ష పార్టీలు ఆనాటి ప్రభుత్వానికి లేఖలు రాశాయని అన్నారు. తోటపల్లి ప్రాజెక్టును రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం ఆరు గ్రామాలను ముంపు నుంచి రక్షించిందని వివరించారు. అదనంగా ఆరువేల ఎకరాలకు నీరందించేలా రీ డిజైన్ చేశామని తెలిపారు. రీడిజైన్ చేయడమంటే రద్దు చేయడం కాదన్నారు. గురువారం ఆయన టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విూడియాతో మాట్లాడుతూ అలాంటి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు అభినందించాల్సింది పోయి విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. ప్రాజెక్టును రద్దు చేయమని గతంలో ప్రతిపక్ష నేతలు, రైతులు లేఖలు రాశారని గుర్తు చేశారు. తోటపల్లి ప్రాజెక్టువల్ల నష్టాలే ఎక్కువని గతంలో రైతులు ప్రభుత్వాన్ని కోరారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలకు ముంచుడు తప్ప తేల్చడం తెలియదని విమర్శించారు. గ్రామాలను ముంచండని ధర్నాలు చేస్తోన్న ఘనత కాంగ్రెస్‌కే చెందుతుందన్నారు. ప్రతిపక్షాలు గుడ్డిగా కారణం లేకుండా ఆందోళన చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్‌పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కనీస అవగాహనలేకుండా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆనాటి ప్రభుత్వాలు కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు కడితే మేం రైతుల కోసం కడుతున్నామని వివరించారు.తోటపల్లి ప్రాజెక్టు కెపాసిటీ 1.418 టీఎంసీలు మాత్రమేనని, వాడుకోగలిగేది 0.9 శాతం మాత్రమేనని వివరించారు. మరి కాంగ్రెస్ వాళ్లను తెలివి తక్కువ వాళ్లు అనుకోవాలా? ఏమనుకోవాలో అర్థం కావడంలేదన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను గుడ్డిగా విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు ఇలాగే మాట్లాడితే ప్రజల ముందు నవ్వులపాలవుతారన్నారు. గౌరవల్లి రిజర్వాయర్ 9 టీఎంసీ కెపాసిటీ కెపాసిటీతో నిర్మిస్తున్నామని తెలిపారు. వామపక్ష నేత చాడ వెంకట్‌రెడ్డి ఫిబ్రవరి 18, 2008న తోటపల్లి ప్రాజెక్టును నిర్మించొద్దని, ఎక్కువ గ్రామాలు ముంపుకు గురవుతాయని ప్రభుత్వానికి రాసిన లేఖను హరీష్‌రావు విలేకరుల సమావేశంలో చూపించారు. ఆనాడు వద్దని లేఖ రాసి ఇవాళ కావాలని డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు. చాడ వెంకట్‌రెడ్డి రాసిన లేఖ తన వద్ద ఆర్నెళ్ల నుంచే ఉందని పెద్ద మనిషి పరువు తీయొద్దని ఇన్నాళ్లు బయటపెట్టలేదని వివరించారు. ఏదో పెద్ద మనిషి కదా అని ఊరుకున్నానని అన్నారు. తమవద్ద ఆదారాలుంటాయనే విషయాన్ని మరువరాదన్నారు. తోటపల్లి ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందన్నారు. రైతులు కోరిన పనే తాము చేస్తున్నామని, ఒక్క ఊరు మునగకుండా రూ. 12వేల కోట్లు దుర్వినియోగం కాకుండా మొత్తం 49 వేల ఎకరాలకు నీరందించవచ్చన్నారు. అలాగే ప్రాజెక్టు రీడిజైనింగ్ అంటే తమ్మిడిహట్టి, కంతనపల్లిని రద్దు చేసినట్టు కాదని, కొన్ని చిన్నచిన్న మార్పులు జరుగుతాయన్నారు. ఇలాగే చేస్తూ పోతే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్‌లోనూ ప్రతిపక్ష ¬దా కూడా దక్కదని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ప్రజలకు తమపై విశ్వాసం ఉంది కాబట్టే అధికారం కట్టబెట్టారన్నారు. తెలంగాణకు నీళ్ల కోసం పోరాడుతున్న తెరాసకు అండగా ఉంటారో… లేక చంద్రబాబు పక్షాన ఉంటారో భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పాలంటూ ప్రశ్నించారు.





