Wednesday, 4 November 2026

రుణమాఫీపై కాంగ్రెస్‌ది.. 

రెండు నాల్కల ధోరణి
– రైతు రుణమాఫీ అమలుపై రాహుల్‌ను ప్రశ్నించిన మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌, జులై7(జ‌నం సాక్షి) : కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో విమర్శలు గుప్పించారు. రైతు రుణమాఫీ అమలుపై రాహుల్‌ను కేటీఆర్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో రుణ మాఫీ చెల్లింపులపై కాంగ్రెస్‌ నేతలు చేస్తోన్న విమర్శలు సరికాదని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఒకే విడత రుణ మాఫీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ తరహాలోనే నాలుగు విడతల రుణమాఫీని కర్ణాటక ప్రకటించిందని తెలిపారు. కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం కర్ణాటకలో నాలుగు విడతల రుణమాఫీని అమలు చేస్తోందని.. అయితే ఇక్కడి కాంగ్రెస్‌ నేతలు మాత్రం తెలంగాణలో ఒకే విడత రుణమాఫీ కావాలని కోరుతున్నారని కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో ఒకే విడత రుణమాఫీ కావాలన్న కాంగ్రెస్‌ నేతలు కర్ణాటకలో ఎందుకు ఆ విధంగా చేయడం లేదని ప్రశ్నించారు. రైతు రుణమాఫీపై కాంగ్రెస్‌ నేతల రెండు నాల్కల ధోరణి సబబేనా అని రాహుల్‌ను కేటీఆర్‌ ప్రశ్నించారు.