Wednesday, 4 November 2026

రూటుమార్చిన నాగబాబు.. 

– లోకేశ్‌ను టార్గెట్‌ చేస్తూ సెటైర్లు
– లోకేశ్‌ లాంటి నిజాయితీ గల రాజకీయ నేతలు ఉండరు
– గతంలో లోకేష్‌ మాట్లాడిన వీడియోలు పోస్టుచేసిన నాగబాబు
హైదరాబాద్‌, జనవరి23(జ‌నంసాక్షి) : నిన్నటి వరకు నందమూరి బాలకృష్ణ తమనుద్దేశించిన చేసిన వ్యాఖ్యలకు మెగాబ్రదర్‌ నాగబాబు కౌంటర్లు వేసి, పొలిటికల్‌ హీట్‌ పెంచిన విషయం తెలిసిందే. తాజాగా నాగబాబు తన రూటు మార్చారు. ఈసారి మంత్రి నారా లోకేశ్‌ను టార్గెట్‌ చేస్తూ సెటైర్‌ వేశారు. మై ఛానల్‌ నా ఇష్టం పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించినట్టు నాగబాబు తెలిపారు. దీన్ని వేదికగా చేసుకుని తన రాజకీయ విమర్శలను కొనసాగిస్తానని పేర్కొన్నారు. ఇది నావ్యక్తిగతమైంది మాత్రమేనని, వీటితో
ఎవరికీ సంబంధం లేదన్నారు. ఏ ఛానల్‌లో చూడనవి, చూసినా కూడా వాటిపై చర్చ పెట్టకుండా మర్చిపోయేలా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని, తాను చెప్పే రాజకీయ అభిప్రాయాలపై ఎలాంటి కామెంట్లు ఉండవని నాగబాబు వెల్లడించారు. వీటిని సరదాగా నవ్వుకోడానికే తప్పా, ఎలాంటి దురద్దేశం లేదని అన్నారు. వ్యక్తిగతంగా ఎవర్నీ ఉద్దేశించి మాట్లాడకపోయినా, రాజకీయపరమైన విమర్శలు మాత్రం ఈ ఛానల్‌ ద్వారా వెల్లడిస్తానని అన్నారు. నారాలోకేశ్‌ను చిన్న పిల్లాడితో పోలుస్తూ, గతంలో ఆయన టీడీపీ గురించి పొరపాటున నోరుజారిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. చిన్నపిల్లలు దేవుడులాంటి వారనీ, వాళ్లకు కల్లాకపటం తెలియదని చిన్నప్పుడు ఓ పాట వినేవాళ్లమని మెగాబ్రదర్‌ నాగబాబు గుర్తుచేశారు. పిల్లలు ఎప్పుడూ నిజాలే మాట్లాడుతారనీ, చెడుమాటలు ఉండవని వ్యాఖ్యానించారు. టీడీపీ నిర్వహించిన ఓ సభలో లోకేశ్‌ మాట్లాడుతూ.. ‘ఎలాంటి బంధుప్రీతి, మతపిచ్చి, కులపిచ్చి ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో ఏదన్నా ఉందంటే అది టీడీపీనే’ అంటూ పొరపాటున చేసిన వ్యాఖ్యలను నాగబాబు ఈ వీడియోలో చూపించారు. ‘ఇంత నిజాయతీగా ముందుకు వచ్చి విూ పార్టీ గురించి నిజాలు చెప్పినందుకు థ్యాంక్యూ లోకేశ్‌ గారూ.. చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇంత నిజాయితీగా ఉండటం దేశంలోని ఏ రాజకీయ నాయకుడికీ సాధ్యం కాదని కితాబిచ్చారు. విూ రాజకీయ విధానాలను, టీడీపీ వైఖరిని చాలా బాగా చెప్పారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిజాలు చెప్పినందుకు ఒక్కసారి లోకేశ్‌ బాబుకి ఓయి వేసుకుందామంటూ నాగబాబు ముగించారు.