Monday, 2 November 2026

రూ.135కే గ్రేడ్ వన్ కందిపప్పు

అకాశాన్నంటిన కంది పప్పు ధరను తగ్గించి.. ప్రజలకు అందించేందుకు సర్కారు చర్యలు తీసుకుటుంది. ఈమేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్ర మిల్లర్లతో మాట్లాడారు. రూ.135కే గ్రేడ్ వన్ కందిపప్పు ఇచ్చేందుకు మిల్లర్లు అంగీకరించారు. అన్ని మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, నగరాల్లో పప్పు అమ్మకం కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మిల్లర్లు మంత్రికి హామీ ఇచ్చారు. మిల్లుల వద్ద కూడా నేరుగా పప్పు కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అటు రేపు ఎర్రగడ్డ రైతు బజార్‌లో కంది పప్పు కేంద్రాన్ని మంత్రి ఈటల ప్రారంభించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *