విమాన ప్రయాణం చేసే ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికులను ఆకట్టుకోవడానికి ఇప్పటికే పలు సంస్థలు భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది గోఎయిర్ సంస్థ. తాజాగా సంస్థ రూ.999కే టికెట్ ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ సోమవారం వరకు అందుబాటులో ఉండనున్నదని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్నవారు జూన్ 23 నుంచి అక్టోబర్ 31 లోపు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చును. వేసవిలో పర్యాటక ప్రాంతాలను సందర్శించే వినియోగదారులకు తక్కువ ధరకే మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కొత్త డిస్కౌంట్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు గోఎయిర్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ ధర్మాని తెలిపారు.




