హైదరాబాద్/మహబూబ్‌నగర్,మే8(జనం సాక్షి): రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. నగరంలోని గచ్చిబౌలిలో వేగంగా వచ్చిన ట్యాంకర్.. బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇకపోతే మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలోని పాత కోర్టు వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. టీవీఎస్ ఎక్సల్ వాహనాన్ని నారాయణపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. టీవీఎస్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
రెండు ప్రమాదాల్లో ఇద్దరు మృతి




