Monday, 2 November 2026

రెండు విమానాలకు బాంబు బెదిరింపులు

రెండు విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం రేగింది. ఢిల్లీ నుంచి నేపాల్ రాజధాని ఖాట్మండూకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్ వేస్ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో  అలర్టైన ఎయిర్ పోర్టు సిబ్బంది బాంబు స్క్వాడ్ కు సమాచారం అందించారు. ఈ రెండు విమానాల్లో బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. దీంతో రెండు విమానాలు ఆలస్యంగా బయలుదేరనున్నాయి. భద్రతా కారణాలతో ఖాట్మండూకు వెళ్లాల్సిన 9డబ్ల్యూ260 విమానాన్ని నిలిపివేసినట్టు జెట్ ఎయిర్ వేస్ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *