Monday, 2 November 2026

అమరావతికి అరపైసా తెచ్చుకోలేదు

C
– హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తావా?

– లోకేష్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ ఎద్దేవా

హైదరాబాద్‌,జనవరి27(జనంసాక్షి): హైదరాబాద్‌ అభివృద్దిని తాము చూసుకోగలమని, అమరావతి సంగతి విూరు చూసుకోండని టిడిపి నేత లోకేశ్‌కు మంత్రి కెటిఆర్‌ సలహా ఇచ్చారు. ముందుగా అమరావతికి నిధులు తెచ్చకుని రాజధాని కట్టుకోవాలన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తామని ఎన్నికల ప్రచారంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హావిూయివ్వడాన్ని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. అమరావతి నగర నిర్మాణానికి కేంద్రం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ తట్టెడు మట్టి…లొట్టెడు నీళ్లను మాత్రమే తెచ్చారని, హైదరాబాద్‌ నగర అభివృద్ధి గురించి ఆలోచించే బదులు అమరావతి నగర అభివృద్ధికి నిధులు తెచ్చుకోవాలని లోకేశ్‌ కు కేటీఆర్‌ చురకలంటించారు. ఇక్కడ అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ హైదరాబాద్‌ సంగతి చూసుకోగలదన్నారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దే దమ్ము, ధైర్యం ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హైదర్‌నగర్‌ డివిజన్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. హైదరాబాద్‌ నగరంలో నివాసం ఉంటున్న ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. గాడిదలకు గడ్డివేసి…ఆవును పాలు ఇమ్మంటే ఇస్తదా? అని ప్రజలను ప్రశ్నించారు. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ని కాదని ఇతరులకు ఓటువేస్తే అభివృద్ధి తీరు కూడా అలాగే ఉంటదన్నారు. బీజేపీ,టీడీపీ, కాంగ్రెస్‌లకు ఓటువేస్తే ఎలాంటి ఉపయోగం లేదని, సమస్యల పరిస్కారానికి, సమగ్ర అభివృద్ధికి అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ కారు గుర్తుకే ఓటువేయాలని కోరారు. 1100 కోట్ల రూపాయలతో ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జానకి రామరాజును గెలిపిస్తే.. హైదర్‌నగర్‌ డివిజన్‌ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత తనదని హావిూ ఇచ్చారు. తాగు నీటి సమస్యపై స్థానికులు ప్రశ్నించగా..  త్వరలోనే అందరికీ ప్రతిరోజు నీళ్లు వస్తాయన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని కోరుతున్న రేవంత్‌రెడ్డికి దమ్ముంటే టీడీపీ నుంచి గెలిచిన15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దామని కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ పాలనపై ప్రజలు విసిగిపోయారని ఆరోపిస్తున్న రేవంత్‌రెడ్డికి దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలన్నారు. నగరంలోని ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేందుకు  అడ్డగోలుగా మాట్లాడితే సహించేదిలేదని హెచ్చరించారు. హైదర్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ సమావేశంలో కేటీఆర్‌తో పాటు పాల్గొన్న కృష్ణారావు టీడీపీ నేతల తీరును ఎండగట్టారు.

విభజనతో ఇరు రాస్ట్రాలకు మేలే జరిగింది

విభజన  రెండు రాష్ట్రాలకు లాభం చూకూర్చిందని  తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. విభజన వల్ల ఎపికి ఎంత మేలు జరిగిందో ఆలోచించండని మంత్రి కెటిఆర్‌ అన్నారు. అలాగే ఐటి ఉద్యోగులు ఓటింగ్‌కు దూరంగా ఉంటారన్న అపప్రథ తొలగించాలని, ప్రతి ఒక్కరూ వచ్చి ఓటేయాలని అన్నారు. ఓటింగ్‌ శాతం పెంచడంలో ముందుండాలన్నారు. విభజన వల్ల ఇరువైపులా లాభం జరిగిందని ఆయన అన్నారు. మాదాపూర్‌ ఫినిక్స్‌ హబ్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఐటి ఫోరమ్‌  సదస్సులో  ఐటి ఉద్యోగులతో ఆయన మాట్లాడారు. ఎపిలో విభజన తర్వాత ఒక ఐఐటి, ఐఐఎమ్‌, విమానాశ్రయ విస్తరణ, అమరావతి రాజధాని నిర్మాణం వంటివి వచ్చాయని, అదే విభజన జరగకుండా ఉంటే ఇవన్ని వచ్చేవా అని కెటిఆర్‌ ప్రశ్నించారు. విభజన జరగకపోతే పాతికేళ్లకు కూడా ఎపి ప్రాంతంలో ఐఐటి వచ్చేది కాదని కెటిఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఐటి రంగం అబివృద్ది చెందడానికి తీసుకున్న చర్యల వల్ల కాలిఫోర్నియాలో కూడా ఇక్కడి ఐటి గురించి మాట్లాడుకుంటున్నారని అన్నారు. ఐటి లో వచ్చే అన్ని పరిణామాలు హైదరాబాద్‌ లో కనిపించేలా చేస్తున్నామని ఆయన అన్నారు.  ప్రస్తుతం హైదరాబాద్‌ గ్లోబల్‌ సిటీగా మారుతోందన్నారు. తమ ప్రభుత్వం టీ హబ్‌, టాస్క్‌ లాంటి కార్యక్రమాలతో ఐటిని అభివృద్ధి చేస్తోందని చెప్పారు. హైదరాబాద్‌ గురించి ఇప్పుడు సిలికాన్‌ వ్యాలీలో కూడా మాట్లాడుతకుంటున్నారని చెప్పారు.మరో వైపు హైదరాబాద్‌ సోషల్‌ కాపిటల్‌ గా కూడా చేస్తున్నామని మంత్రి తెలిపారు. సమైక్యాంధ్ర కొనసాగి ఉంటే మరో 25ఏళ్లయినా అభివృద్ధి పనులు జరిగేవి కావన్నారు. ఐటీ ఎగుమతుల్లో దేశ సగటు 7 ఉంటే… రాష్ట్ర సగటు 16శాతం ఉందన్నారు. రాష్ట్రంలో ఐటీ రంగానికి సంబంధించి పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో హైదరాబాద్‌ను బాగు చేసి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి ఉండేదికాదన్నారు. విడిపోయాకే రెండు రాష్ట్రాలు అభివృద్ధి దిశగా దూసుకుని పోతున్నాయని రామారావు అన్నారు. తెలంగాణ ఉద్యమం స్టేట్‌ ఫైటే కానీ, స్ట్రీట్‌ ఫైట్‌ కాదని అప్పుడే చెప్పామని అన్నారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలు  సోదరభావంతో ముందుకెళుతున్నాయని చెప్పారు.  ప్రస్తుతం తెలంగాణ మిగులు ఆదాయంతో అభివృద్ధి దిశగా పయనిస్తోందని, దేశ వృద్ధి రేటును మించిన వృద్ధిరేటు సాధించిందని తెలిపారు. అదే సమయంలో కొత్తగా ఏర్పడిన ఆంధప్రదేశ్‌ రాష్ట్రం కూడా అభివృద్ధి సాధిస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పుడు ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్‌ వచ్చాయని, గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ అంతర్జాతీయ విమానాశ్రయంగా మారుతోందని చెప్పారు. తిరుపతిలో కొత్త టెర్మినల్‌ వచ్చిందని అన్నారు. అమరావతి అనే కొత్త రాజధాని కూడా వచ్చిందని చెప్పారు. ఏపి 18నెలలుగా అభివృద్ధి దిశగా సాగుతోందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడకపోయుంటే మరో 25ఏళ్లఅయిన ఏపి అభివృద్ధి కాకపోయి ఉండేదని అన్నారు. అమెరికా తర్వాత అతిపెద్ద మైక్రోసాఫ్ట్‌ ఇక్కడే కార్యాలయం ఏర్పటవుతోందని చెప్పారు. ఐటి, గేమింగ్‌, ఎంటర్టైనిరగ్‌ రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఐఫా కార్యక్రమం కూడా హైదరాబాద్‌కు తేవడం టి ప్రభుత్వ ఘనతేనని చెప్పారు. హ్యాపెనింగ్‌ హైదరాబాద్‌, ఇతర ఐటికి సంబంధించిన అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. పంచాయతీ, ఐటి శాఖ మంత్రినని, అయితే ఐటికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు తెలిపారు. కొత్త రాష్ట్రం ఏర్పడితే పెట్టుబడులు ఎలా వస్తాయని, ఐటి రంగంపైనా ఎన్నో అనుమానాలుండేవని.. అవన్నింటినీ పటాపంచలు చేస్తూ అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్పారు. ఐటిలో పెద్ద ఎత్తున్న మరిన్ని కార్యక్రమాలు తెస్తామని చెప్పారు. ఇక్కడ అన్ని ప్రాంతాలవారు సేఫ్‌గా ఉండొచ్చని అన్నారు. విమర్శలు చేయడం ఈజీ కానీ, సామాజిక బాధ్యతను మరువద్దని యువతకు పిలుపునిచ్చారు.  గ్రేటర్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి నగర అభివృద్ధికి సహకరించాలని అన్నారు. గంట సమయం కేటాయించి మంచి అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. తాగునీరు, రోడ్లు, ప్లేగ్రౌండ్స్‌, ఆడిటోరియాలు మొదలగు వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. మంచి కార్పొరేటర్‌ ను ఎన్నుకుని పంపితే ఇవన్నీ జరుగుతాయని చెప్పారు. కాంగ్రెస్‌, బిజెపి, కాంగ్రెస్‌, మజ్లిస్‌ పార్టీలకు ఇప్పటి వరకు అవకాశమిచ్చారు.. ఇప్పుడు తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఆ పార్టీలు పని చేసివుంటే నగరం ఇన్ని సమస్యలతో ఇట్లా ఉండేదా? అని కెటిఆర్‌ ప్రశ్నించారు. చెన్నైకి భిన్నంగా హైదరాబాద్‌ ఏవిూ లేదని, భారీ వర్షం కొడితే పడవలు వేసుకునే పరిస్థితి వస్తుందని అన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధి దిశగా సాగాలంటే టిఆర్‌ఎస్‌ పార్టీకి ఓటేయాలని అన్నారు. 14ఏళ్ల క్రితం కెసిఆర్‌ నాయత్వంలో తెలంగాణ రాష్ట్రం వస్తుందంటే.. రంగుల కలలు అన్నారని.. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని  సాధ్యం చేసుకున్నామని చెప్పారు. ఇప్పుడు సీఎంగా గట్స్‌ ఉన్న లీడర్‌ కెసిఆర్‌ ఉన్నారని.. హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీగా చేసుకుందామని అన్నారు. కెసిఆర్‌ ఓ విజన్‌ ఉన్న నాయకుడని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *