Tuesday, 3 November 2026

రెండో అంతస్తు నుంచి దూకిన వివాహిత

– తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స
హైదరాబాద్‌, జూన్‌29(జనం సాక్షి): నగర శివారు రాజేంద్రనగర్‌ అత్తపూర్‌లోని తేజస్వి నగర్‌ కాలనీలో ఓ గృహిణి ఆత్మహత్యాయత్నం చేసింది. తాను నివాసముంటున్న భవనం రెండో అంతస్తు నుంచి కిందికి దూకేసింది. ఈ ఘటనలో అమె రెండు కాళ్లు విరిగిపోగా వెన్నెముక దెబ్బతింది. స్థానికులు బాధితురాలిని హుటాహుటిన సవిూపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి తల్లి శశికళ కథనం ప్రకారం.. నీలం అగర్వాల్‌ అనే మహిళకు ఐదేళ్ల క్రితం శశి అగర్వాల్‌తో వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్నం రూ.12.50లక్షలు ఇచ్చారు. ప్రస్తుతం వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. వివాహమైనప్పటి నుంచి అత్త, భర్త తన కుమార్తెను వేధిస్తున్నారని.. అందువల్లే నీలం అగర్వాల్‌ ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి కారణమైన భర్త శశి, అత్త విజయలక్ష్మిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.