రెవెన్యూ సదస్సులపై సిఎస్ సవిూక్ష
ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశం
హైదరాబాద్,జూలై8(జనంసాక్షి):సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సుల నిర్వహణపై కలెక్టర్లు,అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు ఇతర రెవెన్యూ అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 15 నుంచి నిర్వహించే మండల స్థాయి రెవెన్యూ సదస్సులను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. రెవెన్యూ సదస్సు షెడ్యూల్‌పై విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సూచించారు. సదస్సుల నిర్వహణ వేదికల వద్ద మొబైల్
ఈ`సేవా కేంద్రం, ఇంటర్నెట్, ఇతర మౌలిక సదుపాయాలతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ రెవెన్యూ సదస్సుల్లో అందే అన్ని దరఖాస్తులకు రసీదులు ఇవ్వాలని చెప్పారు. ఈ నెల 11న ముఖ్యమంత్రి నిర్వహించనున్న కలెక్టర్ల సమావేశానికి, జిల్లా అధికారులు సమగ్ర సమాచారంతో రావాలని కోరారు.