న్యాల్‌కల్ : అంగారక చతుర్దశి సందర్భంగా మెదక్ జిల్లా న్యాల్‌కల్ మండలం రేజింతల్ సిద్ధి వినాయక అలయానికి భక్తులు పోటెత్తారు. మన రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర , కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. బీదర్, జహీరాబాద్ నుంచి పలువురు భక్తులు రేజింతల్ వరకు పాదయాత్రగా చేరుకున్నారు. ఎంపీ షెట్కర్ అలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.




