Tuesday, 3 November 2026

రేపట్నుంచి ఢిల్లీలో కిషన్‌ రెడ్డి దీక్ష!

ఢిల్లీ: సోమవారం నుంచి మూడు రోజులపాటు తెలంగాణ కోసం కిషన్‌రెడ్డి ఉపవాస దీక్ష చేపట్టనున్నారు. తాను చేపట్టబోయే దీక్షకు అద్వానీ సహా బీజేపీ అగ్రనేతలంతా హాజరవుతారని సాక్షి టెలివిజన్తో కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్‌ తన వైఖరేంటో ముందు చెప్పాలని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో తెలంగాణే  మా ప్రధాన ఎజెండా అని కిషన్‌ రెడ్డి స్పష్టం వ్యక్తం చేశారు. ఉద్యమాలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ మోసపూరిత వైఖరి వల్లే తెలంగాణలో వందలాది ఆత్మహత్యలకు  పాల్పడ్డారని  కిషన్‌రెడ్డి ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *