బుద్ధగయ : వరుస బాంబు పేలుళ్ల ఘటనను ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ రేపు గయ బంద్‌కు పిలుపునిచ్చింది. బీహార్ రాష్ట్రంలో అధికార జేడీయూ ఇటీవలే భాజపా పొత్తు నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా సంఘటనతో భాజపా జేడీయూ ప్రభుత్వంపై విరుచుకుపడింది. ప్రభుత్వ వైఫల్యంతోనే మహాబోధి అలయంలో ఉగ్ర దాడి జరిగిందని భాజపా అరోపిస్తోంది.




