సరుబుజ్జిలి, శ్రీకాకుళం: వర్షాలకోసం రైతులు, గ్రామస్థులు నిరీక్షించి, నిరీక్షించి విసిగిపోయారు. ఇక దేవుడి కట్టాక్షం కోసం తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలో వర్షాలుకురవడం లేదని పురుషోత్తపురం గ్రామస్థులు వంశాధర నీటితో శ్రీ ఉమాకామేశ్వర స్వామి అలయంలో కుంభాభిషేకం నిర్వహించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ బిందెలతో నది ఒడ్డుకు చేరారు. వరసగా బిందెలు నింపుకొని అలయం బాట పట్టారు. నది నీటితో అలయంలోని శివలింగానికి అభిషేకం చేశారు. లింగం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఇలా చేస్తే వానలు పడతాయని గ్రామస్థుల నమ్మకమట.




