ఫిరంగిపురం: గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి వద్ద శనివారం మధ్యం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి రెండు ద్విచక్రవాహనాలు, కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గుంటూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.