తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజే టీడీపీ నేతలు రంకెలేశారు. సభ ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే వెల్ లోకి దూసుకొచ్చారు. జాతీయగీతానికి అవమానం కలిగేలా ప్రవర్తించారు. ప్రసంగం కాపీలను చించేసి గవర్నర్ పైకి విసిరారు. రేవంత్ రెడ్డి విసిరిన రెండు కాగితాలు రెండుసార్లు గవర్నర్ ను తాకాయి. టీఆర్ఎస్ సభ్యులు మానవహారంగా ఏర్పడి టీడీపీ సభ్యులను అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ అధికార సభ్యులపై దాడికి దిగారు. సభలో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. అటు రేవంత్ తీరుపై గవర్నర్ నరసింహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్‌పై గవర్నర్ ఆగ్రహం




