Thursday, 5 November 2026

సావిత్రికి ప్రాణం పోసిన కీర్తి సురేశ్‌

ట్విట్టర్‌లో అభినందించిన మంత్రి కెటిఆర్‌
హైదరాబాద్‌,మే10(జ‌నం సాక్షి): సావిత్రి జీవిత కథగా తెరకెక్కిన మహానటి చిత్రంపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రశంసలు కురిపించారు. మహానటి చిత్రం చాలా అద్భుతంగా ఉందన్నారు. నిజంగా ఈ చిత్రం ఎంతగానో అలరించింది. సావిత్రి పాత్రకి కీర్తి సురేష్‌ జీవం పోసింది. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, నిర్మాత స్వప్నలకు తన అభినందనలు’ అని తెలిపారు. సమంత, విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, నాగచైతన్యల నటన అద్భుతంగా ఉందన్నారు. మహానటి చిత్రంపై ఇప్పటికే రాజమౌళి, రాఘవేంద్రరావు, అట్లీ, సుశాంత్‌, మోహన్‌ బాబుతో పాటు పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. దాదాపు 18 నెలల పాటు చిత్రీకరణ జరుపుకున్న మహానటికి ఇంత భారీ రెస్పాన్స్‌ రావడంతో అశ్వినీదత్‌ చాలా హ్యాపీగా ఫీలవుతున్నాడు.  ఈచిత్రంలో సావిత్రి పాత్రని కీర్తి సురేష్‌ పోషించగా, జెమినీ గణెళిషన్‌గా దుల్కర్‌ సల్మాన్‌ నటించారు. చిత్రబృందం ఊహించినట్లుగానే ‘మహానటి’ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బుధవారం విడుదలై బాక్సాఫీస్‌ వద్ద పరుగులు పెడుతోంది. భారత్‌లోనే కాకుండా అమెరికాలోనూ చక్కటి ఆదరణ పొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తదితర ప్రముఖులు ప్రశంసల జల్లులు కురిపించారు. తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ సినిమాను అభినందించారు. బుధవారం రాత్రి ఆయన ఈ సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా ట్విటర్‌ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘ఎంతటి అద్భుతమైన చిత్రం! ‘మహానటి’ సినిమా చూసి దిమ్మతిరిగి పోయింది. కీర్తి సురేశ్‌ సావిత్రి పాత్రలో జీవించేశారు. అద్భుతమైన ప్రదర్శన. ఆమె సినిమాను గొప్పగా తెరకెక్కించిన నాగ్‌ అశ్విన్‌కు, నిర్మాత స్వప్న దత్‌కు నా అభినందనలు. సమంత, విజయ్‌ దేవరకొండ, నాగ చైతన్య చాలా బాగా నటించారు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. వైజయంతి మూవీస్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది. అమెరికాలో కేవలం ప్రివ్యూల ద్వారానే 2,30,000 డాలర్లు (రూ.1.54 కోట్లు) వసూలు చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. సినిమా మిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి సులువుగా చేరుతుందని అంచనా వేస్తున్నారు.