Wednesday, 4 November 2026

రైతుకు పూర్తి భరోసా ఇచ్చిన సిఎం కెసిఆర్‌

పథకాలతో ఆర్థికంగా రైతులు ఎదగాలి
ఆత్మహత్యలకు పాల్పడకుండా ముందుకు సాగాలి: చారి
హైదరాబాద్‌,మే28(జ‌నం సాక్షి):  రైతుబీమాకు క్యాబినెట్‌ ఆమోదంపై ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి, కేంద్ర మాజీమంత్రి డాక్టర్‌ ఎస్‌ వేణుగోపాలచారి హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం రైతులకు భీమా కల్పించిందన్నారు. భీమా తో రైతుల కుటుంబాలకు దీమా కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర రైతుల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. దురదృష్టవశాత్తు రైతు మరణించినా, ఆ రైతు కుటుంబంకు వచ్చే రూ. 5 లక్షల భీమాతో ఆర్ధిక భరోసా ఉంటుందన్నారు. రైతుల కష్టాలు, కన్నీళ్లు తుడచడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి దేశంలోనే మెదటిసారిగా ఇలాంటి పథకం ప్రవేశ పెట్టారని అన్నారు. గతంలో రైతుల సంక్షేమం కోసం ఇన్ని కార్యక్రమాలను అమలు చేసిన దాఖలాలు లేవన్నారు.  రాష్ట్ర రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు ద్వారా ఎకరాకు రూ. 4000 ను అందిస్తున్న ఘనత దేశంలో తెలంగాణలో మత్రమే ఉందన్నారు. దేశ చరిత్రలో సీఎం కేసీఆర్‌ మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని అన్నారు.  రాష్ట్రంలోని రైతులందరికీ వర్తించేలా రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి వారి కుటుంబాల్లో ధైర్యం కల్పించారని అన్నారు. రైతులు ఆత్మహత్యల జోలికి వెళ్లకుండా ప్రబుత్వం అందించే సాయంతో పంటలు పండించి ఆర్థికంగా ఎదగాలని చారి అన్నారు. రైతుల కష్టాలు తీర్చాలనే ఉద్ధేశ్యంతో తెలంగాణ సర్కారు రైతు పక్షాన నిలబడి దేశం గర్విచేలా నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ప్రభుత్వం రైతులకు కోసం తీసుకున్న మరో కీలక నిర్ణయం రైతు బీమా అన్నారు. బీమా  పథకం ఆగస్టు 15 నుంచి అమలవుతుందని, ప్రజాప్రతినిధులు గ్రామాల్లోనే ఉంటూ ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలన్నారు. రైతులకు మరణం సంభవింస్తే ఆ కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులు పడతాయి. ఆగాధంలోకి నెట్టబడుతున్నాయి. ఇక నుంచి రాష్ట్రంలో అలాంటి పరిస్థితి రాకూడదని సీఎం కేసీఆర్‌ రైతులందరికీ బీమా పథకాన్ని ఆగస్టు 15 నుంచి ప్రవేశ పెడుతున్నారని అన్నారు.  రైతులకు అండగా నిలవాలనే లక్ష్యంతో చేపట్టిన బీమా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని  కోరారు. పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు వచ్చిన రైతు దురదృష్టవశాత్తు మరణం సంభవిస్తే రూ. 5 లక్షలు బీమా వర్తించేలా కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారమని తెలిపారు. రాష్ట్రంలో 58 లక్షల మంది వరకు రైతులు ఉన్నారని వారిలో 40 లక్షల వరకు పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు ఇచ్చారని అందరికీ ఇది వర్తింస్తుందని తెలిపారు. సహజంగా బీమా అంటే ప్రమాదాలకు వర్తిస్తుంది కానీ ఇది అందరికీ వచ్చేలా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.