రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోండి

మల్దకల్ జూన్ 28 (జనంసాక్షి) రైతు బంధు 2022-23 వానాకాలం సీజన్ కు సంబదించి జూన్ -22 వరకు రిజిస్ట్రేషన్ ఆయిన రైతులు రైతుబంధుకు దరఖాస్తులు చేసుకోవడానికి,అర్హులుఅయినా రైతులుదరకాస్తు ఫారం,పట్టా పాస్ బుక్ ,ఆధార్ కార్డు,బ్యాంకు అకౌంట్ జిరాక్సులుసంబంధిత ఏఈఓలు ను సంప్రదించి ఇవ్వగలరని వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్ తెలిపారు. దరఖాస్తులకు చివరి వచ్చే నెల 5వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు. మంగళవారము వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులు తమ దరఖాస్తులను అందజేశారు.