మిగతా భూముల సంగతి మరిచారా
అన్యాక్రాంతమైన దేవాదాయ,వక్ఫ్ భూముల సంగతి ?
అనుమానాలకు సమాధానాలు ఇవ్వాల్సింది అధికారులే
హైదరాబాద్,అక్టోబర్30 (జనంసాక్షి) : రైతుబంధు పథకానికి డబ్బుల పంపిణీకి ఉపయోగించిన భూ వివరాలే ఈ పోర్టల్‌లో ఉన్నాయని, సమగ్ర భూ వివరాలు లేవన్న విమర్శలు ఉన్నాయి. దీనిపై అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది. సుమారు 1.45 కోట్ల ఎకరాల భూములు ధరణిలో దర్శనమిస్తున్నాయి. భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన రిజిస్టేష్రన్, మ్యుటేషన్ కూడా వెంటనే జరిగిపోనున్నాయి. ఈ రెండూ కూడా తహసీల్దారే చేసేస్తారు. ఇక ధరణిలోకి ఎక్కించిన భూములే ఫైనల్ అన్న అభిప్రాయంతో ప్రభుత్వం నవంబరు 2 నుంచి రిజిస్టేష్రన్లకూ అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టేష్రన్ జరిగినా పాస్‌బుక్ జారీకి తహసీల్దారు కార్యాలయానికి పంపేవారు. ఆ రిజిస్టేష్రన్‌కు సంబంధించి గ్రామంలో వారం రోజులపాటు అభ్యంతరాల స్వీకరణను వీఆర్వో చేసేవారు. ఆ తరువాతే పాస్‌బుక్ జారీ అయ్యేది. తాజాగా సబ్ రిజిస్టార్ర్ వద్ద ఉన్న వ్యవసాయ భూముల రిజిస్టేష్రన్ అధికారాలను ప్రభుత్వం తహసీల్దార్లకు అప్పగించింది. ఇద్దరి బదులు ఇప్పుడు ఒక్కరు అయ్యారు. దానివల్లనే అంతా పారదర్శకం అవుతుందా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. రిజిస్టేష్రన్, మ్యుటేషన్ చేసే అధికారి.. అంచం అడగరనే గ్యారంటీ ఏమిటని కొందరు అంటున్నారు. అయితే తహసీల్దార్లకు అధికారం ఇవ్వడం కొత్తేవిూకాదని చెబుతున్నారు. ఇక సాంకేతికత అనేది నిరంతరం మారే పక్రియ. దీనిని ఉపయోగించుకొని చాలా రాష్ట్రాలు రెవెన్యూ రికార్డులను ఆన్లైన్ చేశాయి. భూముల సమగ్ర సర్వే జరిపినపుడు గజాలు, సెంట్లు లేదా ఎక్కడో ఓ చోట ఎకరాల్లో తేడాలు రావొచ్చు. అప్పుడు ధరణిలో వివరాలను మార్చాల్సి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది ఉండాలంటే సరిహద్దును సూచించే మ్యాపు ఉండాలి. సరిహద్దుల నిర్దేశం తప్పనిసరి చేయాలి. లేకపోతే అమ్మిన వ్యక్తి, కొన్న వ్యక్తి మధ్య వివాదం తలెత్తే అవకాశముంటుంది. ప్రభుత్వం జారీ చేయబోయే మార్గదర్శకాల్లో ఈ విషయం వెల్లడయ్యే అవకాశముంది. కానీ, ఇది ఎప్పుడనే విషయమై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇక ఆటోలాక్తో దేవాదాయ, వక్స్ భూములకు రక్షణ కలగనున్నా.. ఇప్పటికే ఈ భూములు చాలావరకు అన్యాక్రాంతం అయ్యాయనే ఆరోపణ ఉంది. ఈ నేపథ్యంలో దేవాదాయ, వక్ఫ్ వద్ద ఉన్న భూములనే ధరణిలోకి ఎక్కించడం వల్ల అన్యాక్రాంతమైన వాటిపై ఆశ వదులుకున్నట్లేనా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇదే నిజమైతే ఆక్రమణలకు చట్టబద్ధత కల్పించినట్లవుతుందనే అనుమానం వ్యక్తమవుతోంది. ప్రస్తుత ప్రభుత్వం సాగుదారుల హక్కులను గుర్తించకుండా వారిని రెవెన్యూ రికార్డుల నుండి తొలగించారు. ఇంతకు ముందు పట్టేదారే సాగుదారుడు అయితే పట్టా పాసుపుస్తకం, స్వాధీనపు పాసుపుస్తకం అతనికే ఇచ్చారు. ప్రస్తుతం సాగుదారులను తొలగించడంతో కొందరు హక్కులు కోల్పోయారు. తెలంగాణలో భూముల అమ్మకాలు, కొనుగోళ్ళలో రిజిస్టేష్రన్లు చేసుకోవడం చాలా తక్కువ. భూములు కొనడం, నమ్మకంపై సాగు చేసుకోవడం జరుగుతున్నది. సాదాబైనామాలను కొనుగోలు చేసినట్టు రిజిస్టేష్రన్ ఫీజు తీసుకొని పట్టా మార్పిడి చేశారు.
అంతేకాక అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన అర్హులు, 1950 రక్షిత కౌలుదారీ చట్ట ప్రకారం పట్టా పొంది నేటికి పేరు మార్పిడి జరగని వారు, ప్రభుత్వ భూములు 40 ఏళ్ళకుపైగా సాగు చేస్తున్నవారు నష్టపోతారు. వీరితోబాటు పోడు భూములను సాగుచేసే వారు కూడా నష్టపోతారు. పోడుభూముల సాగుదారులకు శాశ్వత హక్కు కల్పించలేనని సీఎం అసెంబ్లీలో ప్రకటించాడు. అందువల్ల ధరణి వెబ్‌సైట్‌తో నష్టపోయేవారి సంఖ్య 20 లక్షల వరకు చేరుకుంటుంది. ఇకపోతే నిర్ణీత పద్ధతిలో వ్యవసాయం నేర్చుకొన్న తర్వాత భూమికి విలువ పెరిగింది. దేశంలో చాలామంది చాలారకాల రెవెన్యూ చట్టాలకు, భూ విధానాలకు శ్రీకారం చుట్టారు. కొన్ని ప్రజలకు ఫలితాలనిచ్చాయి. కొన్ని వికటించాయి. రెవెన్యూ బాధలు శాశ్వతంగా పరిష్కారం కావాలని, తెలంగాణ రైతులోకం ఎటువంటి ఆటుపోట్లకు గురికాకుండా వారి భూములకు సంపూర్ణ రక్షణ ఉండాలని ఐదేండ్ల కిందటే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు 1,45,58000 ఎకరాల భూముల రికార్డులన్నీ క్లీన్ అయ్యి ధరణి పోర్టల్‌లో దర్శనం ఇస్తున్నాయి. ఈ వివరాలను ప్రపంచంలో ఏ మూలన ఉన్నవాళ్లయినా చూసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఒకరి భూమి ఇంకొకరికి రాయడం, మార్చడం కుదరదు. ఏ అధికారి కూడా వాటిని మార్చలేరని అంటున్నారు. మొత్తంగా ఉద్దేశ్యం మంచిదే అయినా వెనువెంటనే తరుముకుని వచ్చే సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారన్న దానికి అధికారులు సిద్దంగా ఉండాలి.
రైతుబంధు వివరాలే ధరణిలో ఉన్నాయా?




