రైతులకు అండగా భరోసా యాత్ర

అనంతపురం,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) : జిల్లాలో రైతులు ఎదుర్కొటున్న సమస్యలను, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నదీ ప్రజలకు వివరిస్తామని రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హావిూలలను పట్టించుకోలేదని తాము చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తామని అన్నారు. ఇందుఎలో భాంగానే 22 నుంచి వైకాపా అధినేత జగన్‌ రైతు భరోసాయాత్ర చేపట్టారని అన్నారు. రైతుల్లో ఆత్మస్థయిర్యాన్ని కల్గించడానికే రైతు భరోసా యాత్ర అని అన్నారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో జిల్లాలో కరవు తీవ్రంగా ఉందన్నారు. జిల్లాలో రైతుల ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయన్నారు. అసెంబ్లీలో గళం విప్పితే జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఇలాంటి పరిస్థితి లేదని చెప్పడం బాధాకరమన్నారు. ఆత్మహత్యల జాబితాను ప్రభుత్వానికి వైకాపా నాయకులు అందజేసిన తర్వాత ఆత్మహత్యలు జరిగినట్లు ఆంగీకరించారన్నారు. ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ తరుణంలో రైతుల్లో ఆత్మస్థయిర్యాన్ని కల్పించడానికి యాత్ర దోహదపడుతుందన్నారు. టిడిపి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి హంద్రీనీవా పనులు ఒక అడుగు కూడా ముందుకు సాగలేదన్నారు. సాగునీటిని కల్పించడతోనే కరవు నుంచి రైతులకు కాపాడటానికి వీలవుతుందన్నారు. రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపడానికి కృషి చేస్తామన్నారు. వ్యవసాయరంగాన్ని కాపాడటానికి పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు పాటుపడాలన్నారు. రైతు భరోసా యాత్రకు రైతులు పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో రైతులు, చేనేతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని