Sunday, 8 November 2026

రైతులను మోసం చేస్తున్న విశాఖ డెయిరీ

విశాఖపట్టణం,నవంబర్‌24(జ‌నంసాక్షి): పాల రైతుల ధరల సాధన సంఘం ఆధ్వర్యంలో విశాఖ పాల డెయిరీ

వద్ద శనివారం పాల రైతులు ధర్నా నిర్వహించారు. పాల రైతుల నుండి లీటరు పాలు రూ.22 కొని, వినియోగదారులకు రూ.50 అమ్ముతున్న విశాఖ డెయిరీ మోసాన్ని అరికట్టాలని నినాదాలు చేశారు. విశాఖ డెయిరీ లాభాలు పాల రైతులకు బోనస్‌గా ఇవ్వాలని కోరారు. విశాఖ డెయిరీ పాల రైతులకు మద్దతు ధర లీటరుకు రూ.10 పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో పాల రైతులతో పాటు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నరసింగరావు పాల్గొన్నారు.