Wednesday, 4 November 2026

రైతులు ఇబ్బందుల్లో ఉన్నా..  ప్రభుత్వానికి పట్టదా?

– పసుపుకు క్వింటాకు రూ.14వేలు చెల్లించాలి
– రైతులకు అండగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పోరాడతాం
– ఈనెలాఖరులోగా ఎంపీ అభ్యర్థుల ప్రకటన
– పొత్తులపై అధిష్టానానిదే తుది నిర్ణయం
– సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
హైదరాబాద్‌, ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): వ్యవసాయ రంగాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని, ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు కావస్తున్న ఇప్పటి రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టిసారించలేదని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఆయన గాంధీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. నిజామాబాద్‌ జిల్లాలో విరివిగా పసుపును, ఎర్రజొన్నను పండించే రైతులు ఆందోళన చెందుతున్నారని భట్టి అన్నారు. ఎర్రజొన్న, పసుపు రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి పట్టడం లేదని అన్నారు. ఎర్రజొన్నలను కొనుగోలు చేశామన్న ప్రభుత్వం మాటలు అబద్దాలేనని భట్టి మండిపడ్డారు. రైతులు తమ సమస్యలు చెప్పుకోవటానికి ఎన్నికలు పూర్తై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్‌ ఇప్పటి వరకు వ్యవసాయశాఖ అధికారిని నియమించలేదని అన్నారు. మరోవైపు ఆయన అందుబాటులో ఉండటం లేదని దీంతో రైతులు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక మదనపుడుతున్నారని అన్నారు. 2017-08 కాంగ్రెస్‌ హయాంలో క్వింటాల్‌ పసుపుకు రూ.14వేలు చెల్లించామని అన్నారు. ప్రస్తుతం రూ.4వేల నుంచి రూ.5వేలకు పడిపోయిందని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రజొన్నలను రూ.3వేలు మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని భట్టి డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తీరుతో దళారులు ఎర్రజొన్న రైతులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు బోర్డు పెట్టిస్తామన్న ఎంపీ కవిత మాటలు ఏమయ్యాయని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఇప్పుడు రైతుల నుంచి పసుపు కొనుగోలు చేసేవారే లేరని, క్వింటా పసుపును రూ.10వేలకు కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం తీరుతోనే వ్యవసాయ రంగం దిగజారిపోతోందని భట్టి విమర్శించారు. రైతులకు ఎక్కడ అవసరం వచ్చినా అక్కడ కాంగ్రెస్‌ శాసనసభాపక్షం వెళ్తుందని భట్టి పేర్కొన్నారు. ఎంపీ స్థానాలకు భారీగా దరఖాస్తులు వచ్చాయని భట్టి తెలిపారు. ఈనెలాఖరులో అభ్యర్థుల ప్రకటన ఉంటుందని అన్నారు. ఈనెలాఖరులోగా పొత్తులపైకూడా స్పష్టం వస్తుందని భట్టి స్పష్టం చేశారు. నేతలంతా చర్చచేసి.. పొత్తులపై నిర్ణయాన్ని అధిష్టానానికి పంపుతామని అన్నారు. అధిష్టానం తుది నిర్ణయం ప్రకటిస్తుందని భట్టి తెలిపారు.
ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడం లేదు – వీహెచ్‌
ప్రధాని మోదీకి తెలంగాణలో అవినీతి, కుటుంబపాలన కనిపించడం లేదా అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. ఏపీ పునర్విభజన చట్టంలోని హావిూలను కేంద్రం ఎందుకు అమలు చేయడం లేదని ఆయన నిలదీశారు. గాంధీభవన్‌లో వీహెచ్‌ విూడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని అయితేనే తెలంగాణకు ఇచ్చిన విభజన హావిూల పరిష్కారంతో పాటు ఏపీకి ప్రత్యేక¬దా సాధ్యమవుతాయని చెప్పారు. మంత్రివర్గం లేకుండా సీఎం కేసీఆర్‌ కొత్త సంప్రదాయానికి తెరతీశారని అన్నారు.  రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడం లేదని వీహెచ్‌ వ్యాఖ్యానించారు.