*-రైతుల రుణాలను మాఫీ చేయండి…*

 రైతు బందు డబ్బులను రైతు ఖాతాల్లో వెంటనే జమా చేయాలి…*
*- కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ & ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు వేడ్మ బోజ్జు పటేల్…*
ఉట్నూర్ ; ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన రైతు బందు డబ్బును రైతు ఖాతాల్లో వెంటనే జమా చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ & ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు వేడ్మ బోజ్జు పటేల్ డిమాండ్ చేశారు.
గురువారం మండల కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో AO భీంరావ్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈసారి  రైతుబందు డబ్బులు రైతు ఖాతాల్లో సరైన సమయంలో జమా కాలేని కారణంగా ఖరీఫ్ పంటలను సాగు చేయడానికి రైతు దగ్గర చిల్లీ గవ్వలేక పోవటంతో ఇతరుల దగ్గర అప్పులు చేసి ఖరీఫ్ సీజన్ పంటకు సంబందించిన  విత్తనాలను,ఎరువులను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించారని అన్నారు. గతంలో రైతు రుణాలను మాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేశారని పేర్కొన్నారు. ఈసారైనా రైతుల రుణాలను మాఫీ చేసి,రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో త్వరితగతిన జమా చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడ సర్పంచ్ రాహుల్,కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగంపల్లి చంద్రయ్య,జిల్లా కార్యదర్శి దూట రాజేశ్వర్, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాదవ్ సునీల్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సయ్య,మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ సలీం,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అచ్చ దేవానందం,సీనియర్ నాయకులు బిరుదుల లాజర్, బచ్చల రవి,యూత్ కాంగ్రెస్ నాయకులు అరికిల్ల పరమేశ్వర్, నాగవత్ ప్రేమ్, బానోత్ జైవంత్ రావ్,షేక్ హైమద్,దుర్వ మహేష్ తదితరులు పాల్గొన్నారు.