రైతుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో రెండో విడత ఎన్సీడీసీ రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గొర్రెలు పెంచే రైతులకు అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వారి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. అలాగే గొర్రెల కాపరులకు మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్, ప్రణాళికా బోర్డు వైస్ ఛైర్మన్ నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం




