Tuesday, 3 November 2026

రైతుల సమస్యలపై బీజేపీ ఆందోళన : లక్ష్మణ్

laxman
సిద్దిపేట : రాష్ట్రంలోని రైతుల సమస్యలపై బీజేపీ ఆందోళన చేపట్టనుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి 29 వరకు అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టనున్నట్లు తెలిపారు. నవంబర్ 7 నుంచి 11 వరకు జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేయనున్నట్లు లక్ష్మణ్ వెల్లడించారు. రైతులు సంతోషంగా ఉన్నారని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అనడం విడ్డూరం ఉందని అన్నారు. రైతులకు ఇంతవరకు ఇన్‌పుట్ సబ్సిడీ అందలేదని, కేంద్రం ఇచ్చిన కరువు నిధులపై ప్రభుత్వం కాకిలెక్కలు చెబుతోందని లక్ష్మణ్ విమర్శించారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మధ్య సమన్వయం లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆయన అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *