రైతు ఆత్మహత్యాయత్నం

మార్కాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద కలకలం

ఒంగోలు,జూలై2(జ‌నం సాక్షి ): ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్డీవో ఆఫీస్‌ ఎదుట కలకలం చెలరేగింది.శ్రీనివాస్‌రెడ్డి అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. భూపత్రాల కోసం వెళ్తే అధికారులు వేధిస్తున్నారని రైతు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్‌రెడ్డి స్వస్థలం దోర్నాల మండలం బొమ్మలపురంగా గుర్తించారు.